బీటెక్ స్టూడెంట్ సూసైడ్..
posted on Mar 23, 2021 @ 12:11PM
కారణం ఏదైనా కావచ్చు. ఈ మధ్య స్టూడెంట్ తమ భవిత మరిచి. తల్లి దండ్రులను మరిచి తనువులు చలిస్తూ ఆత్మహత్యలకు పాలుపడుతున్నారు. క్షణికావేశంలో నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని చంద్రిక ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షల ప్రిపరేషన్ కోసం వెళ్లిన చంద్రిక హాస్టల్ భవనం పై నుండి దూకి మరణించింది.
చంద్రిక స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతోంది. కళాశాల సమీపంలో ఉన్న కృపా అనే ప్రైవేటు హాస్టల్ లో ఉంటోంది. హాస్టల్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో చంద్రిక మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు మంగళవారం ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు.
విద్యార్థిని చంద్రిక ఫిబ్రవరి 4న వసతిగృహాంలో చేరి.. పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని ఎందుకు మరణించింది. తన మృతి వెనుక ఏ కారణాలు ఉన్నాయి అనేది వివరాలు తెలియరాలేదని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.