తెలంగాణ ప్రభుత్వంలో భారీ కుదుపు... భారీ మార్పులు చేపట్టిన కేసీఆర్...
posted on Feb 3, 2020 9:12AM
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. అయితే, సెకండ్ టైమ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన కేసీఆర్... పాలనా యంత్రాంగంలో పెద్దగా మార్పులు చేర్పులు చేపట్టకుండానే ఏడాదికి పైగా పరిపాలన నెట్టుకొచ్చేశారు. ఏవో చిన్నచిన్న మార్పులు మినహా పాత టీమే కొనసాగుతూవచ్చింది. అయితే, తెలంగాణలో దాదాపు అన్నిరకాల ఎన్నికలు పూర్తవడంతో పాలనపై పూర్తిగా దృష్టిపెట్టారు కేసీఆర్. అందులో భాగంగా భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టారు. 50మంది ఐఏఎస్‌లకు స్థానచలనంతోపాటు కొత్త పోస్టింగులు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లో భారీగా బదిలీలు చేశారు. 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం.... 18మంది సీనియర్ ఐఏఎస్‌ల శాఖలను మార్చింది. అలాగే, 11మంది జూనియర్ ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది.
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా పౌసుమి బసు... భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా అబ్దుల్ అజీమ్... ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా శ్రీదేవసేన... నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా హరిచందన... మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా వెంకటేశ్వర్లు... వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా రాజీవ్ హనుమంతు... గద్వాల జిల్లా కలెక్టర్‌గా శృతి ఓజా... కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా ఎంవీ రెడ్డి... హైదరాబాద్ కలెక్టర్‌గా శ్వేతామహంతి... పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా పట్నాయక్... నల్గొండ జిల్లా కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్... ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా సందీప్ కుమార్... నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా ముషరఫ్ అలీ... మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా వెంకట్రావ్... ములుగు జిల్లా కలెక్టర్ గా కృష్ణ ఆదిత్య... సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా వినయ్ కృష్ణారెడ్డి... మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా వీపీ గౌతమ్... వనపర్తి జిల్లా కలెక్టర్‌గా యాస్మిన్ బాషా... జనగామ జిల్లా కలెక్టర్‌గా నిఖిల... జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా రవి... కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శరత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇక, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా పార్థసారథి.... బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి అండ్ కమిషనర్‌గా బుర్రా వెంకటేశం... విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చిత్రారామచంద్రన్..... వ్యవసాయ కార్యదర్శి అండ్ కమిషనర్‌గా జనార్దన్‌రెడ్డి...... పశుసవంర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదర్‌సిన్హా..... పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్ సుల్తానియా.... నీటిపారుదల ముఖ్యకార్యదర్శిగా రజత్‌కుమార్.... సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శిగా వికాస్‌రాజ్...., ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా.... విపత్తు నిర్వహణ ముఖ్యకార్యదర్శిగా జగదీశ్వర్‌కు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది.
అలాగే, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా గౌతమ్.... జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా రాహుల్ రాజ్... ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా భవిష్ మిశ్రా... ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా హనుమంతు... కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా విల్లురు క్రాంతి... రామగుండం మున్సిపల్ కమిషనర్‌గా ఉదయ్‌కుమార్... నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా జితేష్ వి.పాటిల్... నిజాంపేట మున్సిపల్ కమిషనర్‌గా బి.గోపి... జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా బద్వంత్ సంతోష్... జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ప్రియాంక అల... జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పి.ప్రియాంకను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే, టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇంత పెద్దఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు జరగడం ఇదే మొదటిసారి కాగా, రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికలు పూర్తవడంతో ఇక పాలనపై కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. అయితే, త్వరలోనే మరికొంత మంది ఐఏఎస్‌లను బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.