బాబా రామ్‌దేవ్‌కు 600 ఎకరాలు!
posted on Feb 24, 2016 @ 3:25PM
యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు 600 ఎకరాల భూమిని అందించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికీ, రామ్‌దేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ భూమిలో పతంజలి సంస్థ అరుదైన ఔషధులను పెంచనున్నట్లు సమాచారం. ఇందుకోసం స్థానికంగా ఉండే గిరిజనులను కూడా భాగస్వాములను చేయనున్నారట. నారింజ తోటలను పెంచడం, అటవీ భూములలో ఇప్పటికే సహజసిద్ధంగా లభిస్తున్న తేనె వంటి ఉత్పత్తులను సేకరించడం, కొత్తగా మరిన్ని ఔషధి మొక్కలను పెంచడం... ఇవీ ఈ 600 ఎకరాలలో రామ్‌దేవ్ బాబా తలపెట్టిన కార్యక్రమం!
ఈ ప్రణాళిక కోసం దాదాపు 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. దీని వల్ల కనీసం 10,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని పతంజలి చెబుతోంది. కానీ విపక్షాలు మాత్రం ప్రభుత్వం ఇలా వందలాది ఎకరాలను స్వామీజీవారికి చవక ధరకు ధారాదత్తం చేయడం ఏంటంటూ మండిపడుతున్నాయి. ఇటు మహారాష్ట్రలోనూ, అటు కేంద్రలోనూ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి... రామ్‌దేవ్‌గారికి భూములను కట్టబెడుతున్నారంటూ ఆరోపిస్తున్నాయి.