దేశ్ కీ నేతా కేసీఆర్ ప్రచారం పట్ల ‘మహా’ రైతుల ఆగ్రహం
posted on Sep 28, 2022 @ 4:02PM
దేశ్ కీ నేత అనిపించుకోవాలన్న అత్యుత్సాహంతో కేసీఆర్ నేల విడిచి చేస్తున్న సాము బూమరాంగ్ అయ్యింది. తెలంగాణ అభివృద్ధిని జాతీయ పత్రికలు మీడియాలో కూడా కోట్లాది రూపాయల ప్రజా ధనంతో పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేసి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ఉత్సాహంతోనే పక్కనున్న మహారాష్ట్ర రైతులు కూడా కేసీఆరే ప్రధాని కావాలని, జాతీయనేతగా ఉండాలని కోరుతున్న ట్టు ఒక వార్త తెలంగాణకు చెందిన ఒక దినపత్రికలో ప్రచురితమైంది. ఆ వార్తే ఇప్పుడు కేసీఆర్ బిల్డప్ నంతా ఒక్క సారిగా కుప్పకూల్చేసింది. తాము కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకోవడం లేదనీ, అసలు కేసీఆర్ వల్ల తమకు వీసమెత్తు ఉపయోగం లేకపోగా, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తీవ్రంగా నష్టపోయామనీ మహారైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా కాళేశ్వరం కారణంగా తాము భూములు కోల్పోయామనీ, ఇంత వరకూ తెలంగాణ తమకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదని వారు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం కారణంగా మహారాష్ట్రలోని 15 గ్రామాల రైతులు పంటలు పండిం చు కోలేకపో తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు నష్టపోయిన తమకు తెలంగాణ ప్రభుత్వం కనీసం పరి హారం కూడా ఇవ్వలేదని వారంతా వాపోయారు. కేసీఆర్ పనితీరుతో తీవ్రంగా నష్టపోయిన తాము ఆయన్ని ఎలా సమర్థిస్తామని మండిపడ్డారు.
నష్టపరిహారం కోసం కోర్టుకు వెళతామని హెచ్చరించారు. తాము కేసీఆర్ ను జాతీయ నేతగా ఆహ్వానిస్తు న్నట్లుగా వచ్చిన వార్తలోని ఫొటోలు తమవే కానీ వాటిని ఫేస్ బుక్ లోంచి తస్కరించి ఆ వార్తకు వాడుకు న్నారని వారు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ప్రచారం కోసం తమ ఫొటోలను తమ అనుమతి లేకుండా వాడుకోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలం గాణాకు చెందిన ఆ వార్తాపత్రిక తమ అభిప్రాయం తెలుసుకోకుండానే తమ ఫొటోలు వేసి తామేదో కేసీఆర్ కు ఆహ్వానాలు పలుకుతున్నట్లు, బ్రహ్మరథం పడుతున్నట్లు వార్తలు ప్రచురించి ప్రచారం చేసుకోవడమేమిటంటూ మండి పడుతు న్నారు. తెలంగాణా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో సిరోంచ తాసీల్దా రు కార్యాలయం వద్ద రైతులు నిరసన తెలియజేస్తూ ఆ వార్తాపత్రిక కాపీలను తగులబెట్టారు. వాస్తవానికి, తాము కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరనే లేదని, అసలు కేసీఆర్ ఆశలకి, కంటున్న కలలకి తమకు ఎలాంటి సంబంధం లేదనివారు కుండబద్దలు కొట్టారు. సదరు పత్రికలో వచ్చిన వార్తతో తమకు ఇసుమంతైనా సంబంధం లేదని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర రైతుల నిరసనతో జాతీయ రాజకీయాలంటూ దూకుడు ప్రదర్శిస్తున్న కేసీఆర్ పరువు జాతీ యస్థాయిలో మంటగలిసిందని బీజేపీ వారు సంబరపడుతున్నారు. కర్నాటక రైతు లు కూడా కేసీఆర్ చేసుకుంటున్న ఇటువంటి ప్రచారం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఆ రాష్ట్రా నికి చెందిన నాయ కులు చెబుతున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముందు ఇతర రాష్ట్రాల రైతుల నుంచి ఆగ్రహా వేశాలు వ్యక్తం కావడంతో ఆయన జాతీయ రాజకీయాల వైపు ఆయన అడుగులు ఎలా ముందుకు పడతా యన్న సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.