అర్ధంతరంగా ముగిసిన మిస్త్రీగారి పర్యటన
posted on Jun 15, 2013 @ 2:02PM
కర్ణాటక రాష్ట్ర పార్టీ వ్యవహారాల కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ రాష్ట్ర పర్యటన అర్థాంతరంగా ముగిసింది .ఈ వార్త రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఆయన రాష్ట్రంలో కీలకమయిన జిల్లాలలో సమీక్షలు చేయవలసి ఉంది.అంతే కాకుండా ముఖ్యమంత్రి, పి.సి.సి. కార్యదర్శిలతో భేటీ కావాల్సి ఉంది . కానీ ఆయన జిల్లా సమీక్షలతో పాటు ముఖ్యమంత్రి ,పి.సి.సి. కార్యదర్శిలతో భేటీ లను కూడా రద్దు చేసుకొని, అర్థాంతరంగా పర్యటన ముగించి ఢిల్లీ వె పలు అనుమానాలకు దారితీస్తోంది. రాష్ట్ర క్యాబినెట్ మరియు పార్టీలో ఉన్న అసమ్మతి నేతలు ఆయనతో భేటీ కాకూడదనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచన మేరకే ఆయన తన పర్యటన అర్ధంతరంగా ముగించుకొని వెళ్లిపోయినట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తద్వారా కిరణ్ కుమార్ రెడ్డి అసమ్మతి నేతలు తనకు వ్యతిరేఖంగా అధిష్టానానికి నివేదికలు ఈయకుండా జాగ్రత్తపడినట్లు అర్ధం అవుతోంది. మిస్త్రీ తన తదుపరి భేటీలను త్వరలో ఢిల్లీలో నిర్వహించనున్నట్లు సమాచారం.