ఏమి పీకుతావో పీకమంటున్నరాజేష్

 

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇక తమని పార్టీలోంచి పీకే సాహసం చేయలేరని తెలిసిపోయిన తరువాత, ‘నువ్వు పీకకపోతే మేమే బయటకి పోతాము’ అంటూ, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి శాసన సభ్యుడు మద్దాల రాజేష్, ఈ రోజు చంచల్ గూడా జైలుకెళ్ళి వైయస్. జగన్ మోహన్ రెడ్డిని కలుసుకొన్నారు. శాస్త్ర ప్రకారం జగన్ని జైల్లో కలవడం కూడా పూర్తయిపోయింది కనుక, ఇక నేదో రేపో ఆ పార్టీలో సభ్యత్వం తీసుకొంటున్నట్లు చేసే ప్రకటన లాంచన ప్రాయమే.

 

ఒక విధంగా బొత్స సత్తిబాబుకు ఇది చెంప పెట్టు వంటిది. ఈ రోజు రాజేష్ వెళ్ళినట్లే రేపు మిగిలిన 8 మంది కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపొతే అందుకు సత్తిబాబే దోషిగా నిలబడవలసి ఉంటుంది. ఇంతవరకు, పెద్ద ఇబ్బందులు లేకుండా జగన్ అనుచరుల మద్దతుతో ఎలాగో నెట్టుకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, బొత్స ప్రకటనతో కొరివితో తల గోక్కునట్లు జగన్ వర్గాన్ని రెచ్చగొట్టినట్లయింది. తత్ఫలితమే రాజేష్ నిష్క్రమణ.