రాష్ట్రపతి పాలనతో తెలంగాణ సాధ్యం
posted on Oct 17, 2013 @ 10:35AM
రాష్ట్రపతి పాలన పెడితే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వాని స్పష్టం చేశారు. "ఒక ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. కానీ, ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే. లేదంటే తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న వారి ప్రకటనను అమలు చేయడం సాధ్యం కాదు'' అని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రాంతంలో ఎందరో చనిపోయారు. ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు . మా హయాంలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయగలిగాం అని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటులో బీజేపీ మద్దతుపై తెలంగాణవాదుల నుంచే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో అద్వాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషంగా ఉంది.