ఆ మూడు రోజులూ మద్యం బంద్.. ఎన్నికల వేళ పార్టీలకు షాక్
posted on Nov 21, 2023 @ 2:10PM
ఎన్నికల ప్రచారంలో మందు, డబ్బు ప్రాధాన్యత ఏమిటన్నది అందరికీ తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఎన్నికల సంఘం షాకింగ్ డెసిషెన్ తీసుకుంది. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల ప్రచారంలో చివరి రెండు మూడు రోజులు ఎంత కీలకమైనవో అందరికీ తెలసిందే. ఏప్రిల్ 28 సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడుతుంది. ఇక అక్కడ నుంచీ ప్రచారం అంతా మద్యం, డబ్బులతో జరుగుతుందన్నది తెలిసిందే. ఈ దశలో నవంబర్ 28 నుంచి 30వ తేదీ వరకూ రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. తెలంగాణలో ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. 28 నుంచి 30 వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు లైసెన్స్ దారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఆదేశాలను ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. గత ఎన్నికలు, ఉపఎన్నికల్లో మద్యం ఏరులైన పారిన సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం.. ఈసారి అలా జరగకూడదని ముందుగానే కఠిన నిర్ణయాలు తీసుకుందని అంటున్నారు.