మద్యం అనధికార అమ్మకాలు?
posted on Jul 2, 2012 @ 12:06PM
రాష్ట్రంలో మద్యం అనధికార అమ్మకాలు సాగుతున్నాయి. లైసెన్స్ ఒకరికి ఉంటే వారి చుట్టూ పది మంది పెట్టీషాపులు పెట్టి మరీ బతికేస్తున్నారు. అంతే కాకుండా దాబాలు, క్లబ్బులు కూడా మద్యం అనధికార అమ్మకాలకు తెర లేపుతున్నాయి. అసలు రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన అన్ని ప్రాంతాల్లోనూ ఈ మద్యం అనధికారికంగా అమ్మకాలు సాగుతుంటే ఆ సమాచారం సేకరించటానికి కూడా ఎక్సయిజ్ అయిష్టత వ్యక్తం చేస్తోంది. సిండికేట్ల పుణ్యం ఊరికే ఉంచుకోకూడదని ఈ పెట్టీషాపులను ఎక్సయిజ్ వదిలేసింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు కొన్ని ప్రాంతాల్లో అనధికారిక మద్యం దుకాణాలపై దృష్టి సారించి రాజధానిలో ఒక క్లబ్బును బయటపెట్టారు. ఈ క్లబ్బులో ఎక్సయిజ్ అనుమతి లేకుండా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. బోయినపల్లిలోని ఏడు ఎకరాల్లో ఫ్యామిలీక్లబ్బు ఏర్పాటు చేశారు. నేని హైటెక్‌పేరిట సాగుతున్న ఈ క్లబ్‌లో ఎక్సయిజ్ అనుమతి లేకుండానే మద్యం విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. అందుకే పోలీసులు ఈ క్లబ్బుపై దాడి చేసి 35మంది తాగుబోతులను అరెస్టు చేశారు. క్లబ్బు యజమాని శేఖరరెడ్డి పరారీలో ఉన్నారు. ఈ సంఘటన అనధికార మద్యం అమ్మకాలకు అద్దం పడుతోందని ఇకనైనా ఎక్సయిజ్ గుర్తించాలి.