జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని.. లూద్రా
posted on Sep 11, 2023 @ 2:33PM
స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన తెలుగుదేశం అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలసిందే. శుక్రవారం (సెప్టెంబర్ 9)అర్ధరాత్రి దాటిన తరువాత నెల్లూరులో ఆయనను నిర్బంధంలోకి తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు శనివారం (సెప్టెంబర్ 10)తెల్లవారు జామున అరెస్టు చేసినట్లు ప్రకటించి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. ఆదివారం(సెప్టెంబర్ 10) రాత్రి వరకూ విచారణ, వైద్యపరీక్షలు, కోర్టులో వాదనల అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆదివారం (సెప్టెంబర్ 10) రాత్రి ఆయనను విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక గదిని కేటాయించారు. ఇక జైలు అధికారులు చంద్రబాబుకు ఖైదీ నెంబర్ 7691ను కేటాయించారు. దీంతో 45 ఏండ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు తొలి సారిగా జైలుకు వెళ్లినట్లైంది. జైలులో చంద్రబాబుకు ఐదుగురు సిబ్బందితో భద్రతా కల్పించారు. అంతే కాకుండా జైల్లో ఆయనకు ఓ వ్యక్తిగత సహయకుడు ఉండేందుకు కూడా అనుమతి ఇచ్చారు. అలాగూ జైల్లో చంద్రబాబుకు ఇంటి నుంచి అల్ఫాహారం, భోజనం, మెడిసన్‌కు అనుమతి ఇవ్వాలన్న కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు అవకాశం కల్పించారు. చంద్రబాబును ఉంచిన రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే రాజమహేంద్రవరంలో సెక్షన్ 30 ఆంక్షలను విధించారు. సోమవారం (సెప్టెంబర్ 11) జైలు ఆవరణలోనే చంద్రబాబును ఉంచిన స్నేహ బ్లాక్ కు ఎదురుగా ఉన్న జైలు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి ములాఖత్ ద్వారా కలిశారు. అదలా ఉండగా జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ఆయన తరఫు న్యాయవాది లూద్రా పేర్కొన్నారు. సోమవారం (సెప్టెంబర్ 11) ఆయన ఏసీబీ కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేయనున్నారు. కాగా హైకోర్టులో కూడా చంద్రబాబు బెయిలు కోసం హైస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
అదలా ఉండగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో సీఐడీ తరఫున వాదించిన సిఐడి తరఫున వాధించిన న్యాయవాది సుధాకర్ రెడ్డి కి 4+4 గన్ మన్ లతో తో భద్రత కల్పిస్తూ జగన్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.