మూడు కెమెరాలతో స్మార్ట్ ఫోన్..
posted on Jun 1, 2016 @ 5:23PM
రోజుకో సరికొత్త మొబైల్ మార్కెట్లోకి వస్తుంది. ఇప్పుడు ఎల్జీ కూడా ఓ సరికొత్త మొబైల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణంగా స్మార్ట్ ఫోన్లకి ఫ్రంట్ కెమెరా.. బ్యాక్ కెమెరా ఉంటాయి. అయితే మూడు కెమెరాలతో ఉండే సరికొత్త హైఎండ్ స్మార్ట్ ఫోన్ ను ఎల్జీ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 52,990 అని, ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని ఎల్జీ వివరించింది.
ఫోన్ ఫీచర్లు..
* 5.3 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ క్వాంటమ్ డిస్ ప్లే
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్
* 4 జీబీ ర్యామ్,
* 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 2 టెర్రాబైట్ల వరకూ విస్తరించుకునే సామర్థ్యం ఉన్నాయి.
* బ్యాంక్ 16, 8 ఎంపీ కెమెరాలుండగా, ఫ్రంట్ 8 ఎంపీ కెమెరా ముందు భాగంలో ఉంది.
* 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ