గంగూలీని ఐసీసీకి పంపిద్దాం మోదీజీ...మమతా బెనర్జీ
posted on Oct 17, 2022 @ 3:46PM
భారత క్రికెట కంట్రోల్ బోర్డు అధ్యక్ష స్థానంలోకి మాజీ ప్లేయర్ రోజర్ బిన్నీ వెళ్లవచ్చ. కానీ ఇప్పటి వరకూ బీసీసీఐ అధ్యక్షునిగా ఉన్న సౌరవ్ గంగూలీని వంచించారని, అవమానకరంగా పదవి నుంచి దించేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. గంగూలీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీ సీ) కి పంపించాలని ఆమె ప్రధాని మోదీని కోరారు.
అతని తప్పు లేకుండానే అతన్ని వంచించారని మమతా ఆవేదన వ్యక్తం చేశారు. మమత సోమవారం మీడియాతో మాట్లాడుతూ, సౌరవ్‌ను బీసీసీఐ పదవి నుంచి తప్పించడం సమాచారం విని ఎంతో ఆశ్చర్య పడ్డానన్నారు. భారత క్రికెట్‌కి ప్లేయర్‌గా, కెప్టెన్ గా ఎంతో సేవచేసిన వ్యక్తిని అవమానకరంగా పదవి నుంచి దించేయడం దారుణమని అన్నారు. ఐసీసీ పదవికి అర్హుడని, ఆ పదవికి పోటీ చేయడానికి అనుమతించాలని ఆమె ప్రధానిని కోరారు. ఐసీసీ పదవికి గంగూలీ ఈ నెల 20వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నాడు.
సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షపదవిలోనే కొనసాగాలని అనుకున్నాడు. తనకు ఐసీసీ పదవి మీద పెద్దగా ఆసక్తి లేదన్నాడు. కానీ బోర్డు ఇతర సభ్యులు ఎవ్వరూ గంగూలీకి మద్దతుగా నిలవకపోవడంతో ఆ పదవి నుంచి గంగూలీ దిగిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఎన్నిల ప్రక్రియ ఆరంభం కాగానే చివరి నిమిషంలో భారత్ మాజీ స్టార్ బిన్నీ పేరు తెరమీదకి వచ్చింది. కాగా బోర్డు కార్యదర్శి పదవిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా కొనసాగుతారు.
జై షా, గంగూలీలు రెండో విడత తమ పదవుల్లో కొనసాగవచ్చని కోర్టు స్పష్టం చేసిందని అయినా జై షా పదవిలో కొనసాగుతుండగా గంగూలీని ఏ కారణం చేతనో పదవి వదలవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని మమతా బెనర్జీ అన్నారు. అతనికి బోర్డు ఎంతో అన్యాయం చేసిందని, అవమానించిందని ఆమె అభి ప్రాయపడ్డారు. ఈ కారణంగానే గంగూలీని ఐసీసీ పదవికి వెళ్లేలా, మోదీ రాజకీయాలకు అతీతంగా ఆలో చించి క్రీడారంగ ప్రగతిని దృష్టిలో పెట్టుకుని అనుమతించాలని మమతా బెనర్జీ ప్రధానిని కోరారు.
ఇదిలా ఉండగా, తాను ఐసిసికి వెళ్లడానికి ఇక్కడ మన బోర్డు మద్దతు ఉండాలని, అయితే ఇక్కడి బోర్డు సభ్యుల నుంచి తనకు అంత మద్దతు వస్తుందన్న ఆశా లేదని గంగూలీ అన్నారు. పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి తానూ పోటీపడతానని సౌరవ్ అన్నారు.