లష్కరే తోయిబా అంటే కొత్త అర్ధం చెబుతున్న చైనా....
posted on Oct 21, 2016 @ 10:46AM
లష్కరే తోయిబా అంటే ఉగ్రసంస్థ అని మనకు తెలుసు.. అయితే దీనికి ఇప్పుడు ఓ కొత్త అర్ధం చెబుతోంది చైనా. పాకిస్థాన్ కు చైనా ఎప్పుడూ సపోర్టుగా ఉంటుదన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇప్పుటికీ చాలాసార్లే ఈ విషయం రుజువైంది. ఇదిలా ఉండగా ఒకవైపు భారత్ సహా అగ్రదేశాలు సైతం పాకిస్థాన్ ఉగ్రవాదంపై ఆగ్రహం వ్యక్త చేస్తున్నాయి. అంతేకాదు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఇప్పటికైనా ఆపాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన చైనా మాత్రం.. పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆ దేశ సైన్యానికి చెందిన ఓ సైనిక విభాగమని చెప్పుకొచ్చింది. ఎన్ఎస్జీలో చేరడంలో విఫలమైన వారు (ఇండియా) చైనాను నిందిస్తున్నారని ఆరోపిస్తూ, లష్కరే తోయిబా అనే మిలటరీ గ్రూప్ కు చెందిన వ్యక్తిని ఉగ్రవాదిగా చూపాలని ఇండియా ప్రయత్నిస్తోందని 'గ్లోబల్ టైమ్స్' లో పిచ్చి రాతలు రాసింది. భారత్ తో చైనా సంబంధాలు ఇరు దేశాలకూ ఉపయుక్తకరంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించింది. చైనా, భారత్ లు కొన్ని కీలకాంశాల్లో విభేదాలు పక్కనపెట్టి స్నేహపూర్వక బంధాలను కొనసాగించేలా చర్చలు జరుగుతున్నాయని, సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని పేర్కొంది.