తూర్పు గోదావరిలో దొంగభూముల తనఖా స్కాం
posted on Jun 23, 2012 @ 3:16PM
దొంగడాక్యుమెంట్లతో తనకు ఉన్న దొంగభూములు చూపి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, కడియం, మండపేట మండలాల్లో కోట్లాదిరూపాయలు బ్యాంకు రుణాలను పొందుతున్నారు. ఇలా సుమారు 50కోట్ల రూపాయల రుణాలు బ్యాంకులు ఇచ్చేశాయి. ఆ డబ్బుతో ఉడాయించిన వినియోగదారుల మోసాలు తెలుసుకుని బ్యాంకు అధికార్లు ఘొల్లుమంటున్నారు. ఇసుకమేటలు వేసిన భూములకు, ఎకరాల కొద్ది ఇసుకపర్ర భూముల్లో మొక్కలు పెంచుతున్నామని చూపిస్తే కోట్లాది రూపాయల రుణాలు బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు మోసగాళ్లు బ్యాంకులను మోసం చేసి పరారవుతున్నారు. ఆమ్యామ్యాలు లక్షల్లో ఉండటంతో ఆ రికార్డులను సరిగ్గా చూసుకోకుండా మంజూరు చేయటం, ఆనక వినియోగదారుడు కనిపించలేదని పోలీసులను ఆశ్రయించటం ఇక్కడ పరిపాటి అయ్యింది. ఎక్కువగా కేసు పెట్టడానికి కూడా బ్యాంకు అధికారులు ఇష్టపడటం లేదు. ఎందుకంటే తమ గుట్టు కూడా బయటపడుతుందని వారు భయపడుతున్నారు. గ్రామీణబ్యాంకులు, సొసైటీలిమిటెడ్‌లు ఇలా నష్టపోయాయని అంచనా.