విభజన ప్రక్రియ ముందుకు సాగదు:లగడపాటి
posted on Aug 7, 2013 @ 11:37AM
రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు సాగదని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అంటున్నారు. ఈ విధంగా తమకు కేంద్రం నుంచి హామీ అందిందని ఆయన అన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వల్లే ఇన్నాళ్ళు రాష్ట్రం సమైఖ్యంగా వుందని అన్నారు. రాష్ట్ర విభజన్ ప్రక్రియ ఆగిపోయిందని, దీనిని అధికారికంగా ప్రకటించాలని లగడపాటి డిమాండ్ చేశారు.
ఈరోజు లగడపాటి నివాసంలో సీమాంధ్ర ఎంపీలు భేటి అయ్యారు. హర్ష కుమార్, ఎస్పీవై రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కెవిపి రామచంద్ర రావు, సాయి ప్రతాప్, అనంత వెంకట్రామి రెడ్డిలు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.ఎకె ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి తమ అభిప్రాయాలు, అనుమానాలను తెలియజేస్తామని అన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చాకే విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.