మునుగోడు టిఆర్ ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల
posted on Oct 7, 2022 @ 1:53PM
కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధిగా సీఎం కేసీఆర్ ప్రకటిం చారు. మునుగోడులో బీసీ ఓటర్లు అధికశాతంలో ఉన్నారు. సర్వేల ఆధారంగా కూసుకుంట్ల గెలవడానికి అవకాశం ఉందన్న సమాచారంతోనే కేసీఆర్ ఆయన్ను తమ అభ్యర్ధిగా ప్రకటించారు.
మునుగోడు నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న కూసుకుంట్ల..ఈనెల 10న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి హాజరుకానున్నారు. మును గోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తు న్నారు.
ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలంనుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పని చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపాలని టీఆర్ ఎస్ స్థానిక నేతలు, కార్యకర్తలు కోరు కుంటున్నారని.. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే నివేదికలను పరిశీలించిన తరువాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. 2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంలో మునుగోడు నియోజక వర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం తప్పుకున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తననే మళ్లీ గెలిపిస్తారని, బీజేపీ నేత ధీమాగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా కొన్ని రోజుల కిందట ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ (బీ ఆర్ ఎస్) అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తమ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తమ వెంటే ఉన్నారని, విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అందులోనూ గులాబీ పార్టీ బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా మారింది.