హైకోర్టులో కేటీఆర్ కు ఎదురుదెబ్బ.. క్వాష్ పిటిషన్ కొట్టివేత
posted on Jan 7, 2025 @ 10:03AM
తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు మంగళవారం (జనవరి 6)న తీర్పు వెలువరించింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేటీఆర్ తరఫు న్యాయవాది విజ్ణప్తిని కూడా కోర్టు తిరస్కరించింది.