గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టిన కేటీఆర్..
posted on Mar 14, 2021 7:12AM
తెలంగాణలో రాజకీయ కాక రేపిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు ఎమ్మెల్సీల పరిధిలో దాదాపు 10 లక్షల 40 వేల మంది ఓటర్లున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ సీటు పరిధిలో 5 లక్షల 34 వేల మంది ఓటర్లు ుండగా..799 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్గొండ-ఖమ్మం- వరంగల్ సీటు పరిధిలో ఐదు లక్షల 5 వేల మంది ఓటర్లు ఉండగా..736 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పోలింగ్ ప్రారంభమైన వెంటనే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షేక్ పేట తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తొలి ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయడానికి వచ్చే ముందు తాను.. తన ఇంట్లోని గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టుకుని వచ్చానని చెప్పారు. ఎవరు గెలిస్తే మంచి జరిగుతుందో ఆలోచించి పట్టభద్రులు ఓటు వేయాలని కోరారు కేటీఆర్.
పట్టభద్రులంతా ఓటింగ్ రావాలని కోరారు కేటీఆర్ . సండేను హాలీడే గా ఎంజాయ్ చేయకుండా విధిగా వచ్చి ఓటింగులో పాల్గొనాలని పిలుపిచ్చారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో కేవలం 36 శాతం మాత్రమే పోలింగ్ జరిగిందని.. ఈసారి అలాంటి పరిస్థితి ఉండవద్దని తాను కోరుకుంటున్నానని తెలిపారు కేటీఆర్.