తెలంగాణ సీఎంగా కేటీఆర్?
posted on Jul 24, 2014 @ 4:05PM
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్? ఇది ఒక ఊహాజనితమైన అంశం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అందులో ఏ డౌట్ లేదు.. మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ పేరు ఎందుకు వచ్చిందని డౌటు కదూ.. అది ఏమిటంటే, హైదరాబాద్‌లో జరిగిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ‘‘సార్.. మీరే మా ముఖ్యమంత్రి అనుకుని మా సమస్యలు చెబుతున్నాం’’ అని ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అలా కేటీఆర్‌ని ఆ మహిళలు ముఖ్యమంత్రిగా భావించి తమ సమస్యలు చెప్పుకున్నారు. అదీ అసలు విషయం! ఏమో.. ఆ మహిళల నోటి చలవ పుణ్యమా అని అన్నీ కలిసొస్తే భవిష్యత్తులో కేటీఆర్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారేమో! ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ తరహాలో... ఏమంటారు?