కెటిఆర్ అరెస్ట్ తప్పదంటూ ప్రచారం... కవిత, హరీష్ రావు పరామర్శ

ఫార్ములా ఈ రేస్ కేసులో  మాజీ  మంత్రి  కెటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో  నందినగర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి కెటీఆర్ అరెస్ట్ తప్పదంటూ ప్రచారం ఊపందుకుంది. తీర్పు కాపీ వచ్చిన వెంటనే ఎసిబి  మాజీమంత్రిని అరెస్ట్ చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. నందినగర్ లో కెటీఆర్ నివాసమున్న ఇంటికి బిఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నాయి. బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్ రావు కెటీఆర్ ను పరామర్శించారు. కెటీఆర్  తన లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు. ఆయన సుప్రీంకోర్టు గడపదొక్కనున్నారు. కెటీఆర్ ఇంటి వద్ద తెలంగాణ ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.   కెటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చన్న సమాచారం రావడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.