బీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో నేడు కేసీఆర్ సమావేశం
posted on Dec 26, 2025 @ 10:02AM
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో సమావేశమవనున్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకంపై కేసీఆర్ చర్చించానున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించి పనులు దాదాపు పూర్తి స్థాయికి తీసుకొచ్చినా, ప్రస్తుత రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం ప్రభుత్వం తిరస్కరించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని ఈ విషయాన్ని ఎండగట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.కృష్ణా నది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేవలం 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడం దారుణమని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.