మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కన్నుమూత
posted on Jul 20, 2013 @ 11:13AM
మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు శనివారం ఉదయం కన్నుమూశారు. పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో తన కుమార్తెకు మద్దుతుగా ప్రచారం కోసం పశ్చిమగోదావరి జిల్లా కామవరపు కోట మండలం తూర్పుఎడమపల్లి వచ్చేందుకు ఆయన కారు ఎక్కుతూ గుండె పోటుతో హఠతన్మరణం చెందారు. టిడిపి పార్టీలో చేరిన విద్యాధరరావు పదేళ్లపాటు పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పారు. కొద్దికాలం ఎపిఐఐసి ఛైర్మన్ గా పనిచేశారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1989-94 మద్య చంద్రబాబు నాయుడుతో కలిసి కాంగ్రెస్ పార్టీపై శాసనసభలో తీవ్ర స్థాయిలో చెలరేగేవారు.1994లో ఎన్.టి ఆర్ క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండేవారు. తర్వాత తెలుగుదేశం తిరుగుబాటులో విద్యాధరరావు కీలక భూమిక పోషించారు. తదనంతరం చంద్రబాబు క్యాబినెట్ లో భారీ పరిశ్రమలు, పంచాయతీ రాజ్ వంటి శాఖలను ఆయన నిర్వహించారు.రెండువేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరి పార్టీ నేత చిరంజీవికి సన్నిహితుడుగా ఉన్నారు. అయితే కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం కావడంతో ప్రస్తుతం ఆయన పీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు.