లగడపాటిని బహిష్కరించాలి
posted on Oct 28, 2013 @ 11:39AM
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై రాష్ట్ర మంత్రి కొండ్రు మురళీమోహన్ మండిపడ్డారు. లగడపాటి మీడియాలో కనబడేందుకు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతుంటాడని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయింది అవాస్తమని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న లగడపాటిని ముందు పార్టీ నుండి బహిష్కరించండి. ఇదే విషయం కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కోరుతున్నా అని అన్నారు.
చంద్రబాబు నాయుడు , వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు ఇచ్చారు. మరి జగన్ మాత్రం ఆ విషయం ఎవరితోనూ చెప్పడం లేదు. రాహుల్ గాంధీని ప్రదానిని చేయాలన్నది జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కోరిక అని జగన్ కు తెలియదా ? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా సమైక్యత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం లేదని తాను భావిస్తున్నానని మురళీమోహన్ అన్నారు.