కొండా సురేఖమ్మా! ఎందుకంత ఆవేశం?
posted on Dec 19, 2012 @ 11:23AM
తే.ర.స. మరియు వై.యస్సార్. పార్టీల మద్య చిన్నగా మొదలయిన గొడవ నిన్నటి పరస్పర దాడులతో పెద్దయుద్ధంగా మారిపోయింది. తే.ర.స. పార్టీ ఎంత ఘాటుగా ప్రతిస్పందిస్తోందో అంతకంటే ఎక్కువగానే వై.యస్సార్. పార్టీ నాయకురాలు కొండాసురేఖ కూడా స్పందిస్తూ కయ్యానికి సై అంటే సై అని పందెంకోడిలాగా కాలు దువ్వుతూ తెలంగాణాలో తనకకి ఎదురేలేదనుకొంటున్న తే.ర.స. కి ఒక కొరకరాని కొయ్యలా ఆమె తయారయిందనాదంలో సందేహం లేదు.
మంచి వాగ్దాటి, రాజకీయ చతురత, పరిణతి కలిగిన ఆమె టీవీ చాన్నళ్ళలో తన ప్రత్యర్దులను డ్డీ కొంటున్న తీరుకి ఆమె శత్రువులే నివ్వెరపోతున్నారు. ‘అటువంటి నాయకురాలు మా పార్టీకి ఉంటేనా!’ అని మనసులోనయినా ఆమె దైర్యానికి, రాజకీయ పరిణతికి మెచ్చుకోకుండా ఉండలేరు. అయినప్పటికీ వారికి ఆమెని డ్డీ కొట్టక తప్పట్లేదు.
అయితే, ఇంత హట్టాతుగా కొండాసురేఖ తెరపైకి ఎందుకు రావలసి వచ్చింది అని ఆలోచిస్తే మనకి చాలా సమాధానాలే కనిపిస్తాయి. మొట్ట మొదటిగా కొద్ది రోజుల క్రితం జగన్ సోదరి షర్మిల, కేసిర్ ని తన పాదయాత్రలో ఘాటుగా విమర్శించడం, ఆ తరువాత ఆమెకి తెలంగాణాలో ఎదురయిన ఇబ్బందులూ చూసినప్పుడు, వై.యస్సార్. కుటుంభ సభ్యులు ఎవరూ కూడా కేసిర్ ని గానీ అతని పార్టీ సభ్యులని గానీ నేరుగా డీ కొట్టడం వల్ల వచ్చే ఇబ్బందులను వై.యస్సార్. పార్టీ గ్రహించినట్లు కనిపిస్తోంది. పైగా తే.ర.స. తమ పార్టీ పై వేసిన ‘సీమంద్రాముద్ర’ కూడా ఆ పార్టీవారిని నేరుగా డ్డీ కొట్టేందుకు అడ్డుపడుతోందని అనుకోవచ్చును. అప్పుడు సహజంగానే తెలంగాణాలో తమ పార్టీకి పెద్ద దిక్కుగా కనిపిస్తున్న కొండాసురేఖనే యుద్ద రంగంలో ముందును నిలిపి తెలంగాణా మనిషితోనే ఎదురు దాడి చేయించే ప్రయత్నంలోనే వై.యస్సార్. పార్టీ ఆమెని తెరపైకి తీసుకు వచ్చి ఉండవచ్చును.
ఆమెలో జగన్ పట్ల చెక్కుచెదరని నమ్మకం, అభిమానం, జగన్ కుటుంభం కోసం ఎంతటి త్యాగాలకయినా సిద్దపడే ఆమె నైజం, అపారమయిన ఆమె రాజకీయానుభవం, రాజకీయ చతురత, అపూర్వమయిన ఆమె వాగ్ధాటి అన్నీకలగలిసి ఆమెకి వై.యస్సార్. పార్టీలో తెలంగాణాలో ఒక ప్రత్యెక హోదాను అందజేశాయి.
గులక రాయితో కొట్టేవాడిని బండరాయితో కొట్టాలంటే అందుకు సమర్దుడయిన వ్యక్తిని వెత్తుకోక తప్పదు. వై.యస్సార్. పార్టీ కూడా ఇప్పుడు అదే పని చేసింది. మహాబలమయిన తే.ర.స. మరియు దాని నేతలని ఎదుర్కోవాలంటే అంతటి సామర్ద్యంగల వారినే తన యుద్దానికి నాయకుడిగా నియమించుకోవాలి. ఆ వ్యక్తీ తప్పనిసరిగా తెలంగాణా వ్యక్తీ అవడం మరొక ప్రాదమిక అర్హత. అందుకే వై.యస్సార్. పార్టీ కొండసురేఖని తన తెలంగాణా యుద్దంలో నాయకురాలిగా ఎన్నుకొని ఆమెని ముందు ఉంచి పూర్తిస్థాయిలో దైర్యంగా ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టింది. రేపు తెలుగుదేశం కూడా ఇదే పద్దతి అవలంబించినా ఆశ్చర్యపోనవసర లేదు.
అప్పుడు తే.ర.స. తన తెలంగాణా మనుషులతోనే యుద్ధం చేయకతప్పదు. ఎప్పుడయితే అది ఆ పనిచేసిందో దానిపట్ల తెలంగాణా ప్రజల్లో ఏంతో కొంత విముఖత ఏర్పడకపోదు. పైగా, ఆమె కూడా పక్కా తెలంగాణా వ్యక్తే గనుక, తెరాస నాయకుల మాటలకు ప్రజల్లో ఎంత విలువ ఉంటుందో ఆమె మాటలకీ అంతే ఉంటుంది. ఒక మంచి వ్యూహంతో ముందుకు వచ్చిన వై.యస్సార్. పార్టీని ఇప్పడు తెరాస ఏరకంగా ఎదుర్కోబోతోందో త్వరలోనే తెలుస్తుంది.
గానీ ఒక్క విషయం మాత్రం నిజం! నిన్నటి వరకు ఆమె చేసిన ప్రతిభావంతమయిన యుద్ధం ద్వారా తనను తానూ సమర్డురాలయిన ఒక నాయకురాలిగా నిరూపించుకొన్న కొండసురేఖ వై.యస్సార్.పార్టీకి తెలంగాణాలో ఒకపెద్ద దిక్కుగా నిలిచి రాగల రోజుల్లో మరింత కీలక బాద్యతలు చేప్పటి ఆమే పార్టీని ముందుకు నడిపించవచ్చును.