కోహినూర్ ను వెనక్కి తీసుకురండి..
posted on Aug 1, 2016 @ 11:56AM
కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట వజ్రాన్ని తీసుకురావడం కుదరదని చేతులెత్తేసిన కేంద్రం.. ఆ తరువాత మాత్రం వజ్రాన్ని భారత్ కు తెప్పించడానికి బాగానే ప్రయత్నాలు చేపట్టింది. అయితే బ్రిటన్ మాత్రం వజ్రాన్ని వెనక్కి ఇచ్చేది లేదని ఎప్పుడో తేల్చిచెప్పింది. అయినప్పటికీ.. కోహినూర్‌పై తమ ప్రయత్నాలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) ప్రధాన కార్యదర్శి హరిచరణ్ సింగ్ వజ్రాన్ని భారత్ తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కోరారు. దీనిలో భాగంగానే ఆయన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ తో భేటీ అయ్యారు. కోహినూర్ వెనక్కి తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ అంశంపై వచ్చేనెలలో బ్రిటన్ ప్రభుత్వంతో మాట్లాడుదామని సుష్మ మహేశ్ శర్మకు చెప్పినట్టు తెలుస్తున్నది. విలువైన కోహినూర్ వజ్రాన్ని అప్పగించాలని భారత్‌తో సహా మరో నాలుగు దేశాలు బ్రిటన్‌ను కోరుతున్నాయి.