కోహినూర్ వజ్రం పాకిస్థాన్ కు చెందినదా..?
posted on Feb 10, 2016 @ 9:45AM
అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికి చెందింది అంటే వెంటనే భారతదేశానికి చెందినది అని అంటుంటారు. కానీ ఇది వారి దేశానికి చెందినది అంటున్నాడు ఓ న్యాయవాది. మన పొరుగుదేశమైన పాకిస్థాన్ కు చెందిన జావేద్ ఇక్బాల్ జాఫ్రీ అనే న్యాయవాది.. కోహినూర్ వజ్రం పాకిస్థాన్‌దేనని అంటున్నాడు. దీనిపై పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్ర లాహోర్ కోర్టులో పిటషన్ కూడా వేశాడు. 'అప్పటి అవిభాజిత పంజాబ్ రాష్ర్టాన్ని పాలించిన మహారాజా రంజిత్‌సింగ్ మనవడు దిలీప్‌సింగ్ నుంచి కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ తీసుకెళ్లింది. ఇంకా చెప్పాలంటే ఎత్తుకెళ్లింది.. అప్పుడు ఎలాంటి చట్టాలు లేవు.. కాబట్టి న్యాయంగా ఆ వజ్రం పాకిస్థాన్‌కు చెందాల్సిందే' అని తన పిటిషన్లో పేర్కొన్నాడు. కోహినూర్‌పై తాను ఇప్పటివరకు బ్రిటన్ రాణికి, పాకిస్థాన్ ప్రభుత్వానికి 786 లేఖలు రాశానని కూడా పేర్కొన్నారు. మరి మనతో అన్ని విషయాల్లో పోటీ పడే పాకిస్థాన్ ఇప్పుడు కోహినూర్ వజ్రంలో కూడా పోటీ పడుతుంది. మరి దీనికి భారత్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.