టిడిపిని వీడేందుకు నిర్ణయించుకున్న కోడాలి నాని
posted on Jul 7, 2012 @ 12:40PM
కొడాలి నాని టిడిపిని వీడేందుకు నిర్ణయించుకున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జగన్ పార్టీలోకి చేరేందుకు తన అనుచరులను, సన్నిహితులను ఒప్పించడాని అంటున్నారు. చంద్రబాబు చెప్పినా జగన్ పార్టీలో చేరే వార్తలను కోడాలి నాని ఖండించలేదు. జైలులో జగన్ ని కలిసిన తరువాత తన నిర్ణయం ప్రకటిస్తాడని, అయితే టిడిపికి రాజీనామా చేసిన తరువాతె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని జగన్ అన్నట్టు సమాచారం. ఈ నెల 9న కాని 18న కాని నాని టిడిపికి రాజీనామా చేయనున్నారని సమాచారం.
ఈ మేరకు వచ్చిన మీడియా కధనాల ప్రకారం, నాని సన్నిహితులు గత వారం రోజులుగా జగన్ ను కలిసి మంతనాలు జరుపుతున్నారని, అవి ఓ కొలిక్కి వచ్చాయని, ఇక నాని టీడీపీని వీడడమే తరువాయి అని అంటున్నారు. లోగడ నానీ టీడీపీ సభ్యత్వం తో పాటు అస్సెంబ్లీ సీటుకు కూడా రాజీనామా చేయాలంటూ జగన్ షరతు పెట్టినట్లు ప్రచారం లో వుంది. కాని తాను అస్సెంబ్లీ కి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు ఏర్పడి ఆ తర్వాత 2014 లో మళ్ళీ, ఇలా రెండు సార్లు ఎన్నికలు ఎదురుకోవలసి వస్తుందని నానీ వెనకాడినట్లు సమాచారం. అయితే, ఈ రెండు సార్లు కూడా టికట్టు తో పాటు ఎన్నికల ఖర్చును కూడా జగనే భరిస్తానని మాట ఇచ్చారని, అలా అయితే సరేనన్న నానీ వైకాపా లో చేరుతున్నారని తెలిసింది.