ఇలా ఏఐజీ నుంచి డిశ్చార్జ్.. అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి కొడాలి నాని

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ కాగానే అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైలోని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. ఈ నెల 26న కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్న నానిని ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందనీ ఏఐసీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొడాలి నానికి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు వాల్వ్ లు మూసుకుపోయాయనీ, స్టంట్ అమర్చాలి  లేదా బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో కొడాలి నాని కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కొసం ముంబైలోని ఏషియన్ హర్ట్ ఇనిస్టిట్యూట్ కు తరలించాలని నిర్ణయించు కున్నారు. దీంతో వారి విజ్ణప్తి పేరకు ఏఐజీ ఆస్పత్రి నుంచి కొడాలి నానిని డిశ్చార్జ్ చేశారు.  ఆ వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలించారు. ఈ ఎయిర్ అంబులెన్స్ లో కొడాలి నానితో పాలటు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు,  అలాగే ఏఐజీ ఆస్పత్రికి సంబంధించిన ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు.

telugu one news

Teluguone gnews banner