వైయస్ జగన్, కొడాలి నానిని ఏ మగాడు అడ్డుకోలేడా?
posted on Apr 7, 2013 @ 12:16PM
నేను శాసన సభ్యుడిని కాకుండా, జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఏ మగాడు అడ్డుకోలేడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించారు. చంద్రబాబు తప్ప ఎవరైనా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవచ్చని, టిడిపి నుంచి ఎన్టీఆర్ గెంటేసిన చంద్రబాబుకు ఆయన ఫోటో పెట్టుకునే హక్కులేదని నాని ధ్వజమెత్తాడు. షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర నేపథ్యంలో గుడివాడలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌ను జైలుకు పంపాయని, జగన్ పార్టీలో చేరినందుకు నన్ను నానా మాటలు అన్నారు. నేను డబ్బులు తీసుకుని జగన్ పార్టీలో చేరానని ప్రచారం చేశారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కుటుంబానికి అండగా ఉంటామని కృష్ణా జిల్లా మొత్తం చెబుతుందని, ఎన్టీఆర్ ఫోటో వాడుకున్నానని అవాకులు, చవాకులు పేలుతున్నారని, అసలు చంద్రబాబుకే ఆయన ఫోటో వాడే హక్కులేదని అన్నారు.