నైట్ రైడర్స్ ఫైనల్‌కెళితే షారుక్ షో
posted on Apr 18, 2011 @ 2:50PM
కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్ హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోవడంతో ఫుల్ సంతోషంలో ఉన్న జట్టు యజమాని, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తమ టీం ఐపీఎల్-4 సీజన్ ఫైనల్‌కు చేరితే... దాదా సౌరభ్ గంగూలీలా చొక్కా విప్పి..గాలిలోకి ఎగిరేసి.. సిక్స్ ప్యాక్ కండలను ప్రదర్శిస్తానని పేర్కొన్నాడు. ‘మేము ఫైనల్‌కు చేరితే..నేను చొక్కా విప్పి..గాలిలో విసిరేసి..నా సిక్స్‌ప్యాక్స్ లేదా ఎయిట్ ప్యాక్ బాడీని ప్రదర్శిస్తాన’ని షారుక్ తెలిపారు. ఈడెన్ గార్డెన్స్'లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై నైట్‌రైడర్స్ విజయం సాధించిన అనంతరం ఆయన మీడియా అన్నారు. 2002లో లార్డ్స్ మైదానంలో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోపి ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై భారత్ గెలవడంతో గంగూలీ పట్టలేని ఆనందంతో చొక్కా విప్పి గాలిలో తిప్పుతూ హల్‌చల్ చేశారు. దీనిపై గంగూలీని బ్రిటిష్ మీడియా విమర్శించింది. ప్రస్తుత ఐపీఎల్‌లో గంగూలీని ఏ జట్టు కొనుగోలు చేయకపోవడంతో ఆయన ఆడడం లేదు.