రాహుల్ వెడ్స్ అతియా షెట్టి వెరీ సూన్
posted on Nov 22, 2022 @ 9:54AM
టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రేయసి, బాలీవుడ్ హీరోయిన్ అతియా షెట్టిని త్వరలో మనువాడ బోతున్నాడు. ఈ విషయాన్ని రాహుల్, అతియా జంట స్వయంగా చెప్పారు. దీనినే అతియా షెట్టి తండ్రి, నటుడు సునీల్ షెట్టి ధృవీకరించాడు.
అయితే వివాహ తేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పాడు. తరచుగా క్రికెట్ సిరీస్ లతో రాహుల్ ఎక్కవగా విదేశీ పర్యటనల్లో ఉన్నందున, అతడికి ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు పెళ్లి చేసుకుంటారని సునీల్ షెట్టి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం హేరా ఫేరీ 3తో బిజీగా ఉన్న సునీల్ షెట్టీ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నాడు
కానీ అతియా షెట్టి మాత్రం 2019 తరువాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ప్రస్తుతం అతియా షెట్టి, కేఎల్ రాహుల్ లు లివిన్ రిలేషన్ లో ఉన్నారు. గత మూడేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఆ విషయాన్ని వీరు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ రిలేషన్ ను వివాహ బంధంతో మరింత పటిష్టం చేసుకోనున్నారు.