Read more!

కిషన్ రెడ్డి తోక కట్ : అంబర్‌పేటలో నామినేషన్

 

 

 

భారతీయ జనతా పార్టీ దైవం శ్రీరాముడు. భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు తమను తాము రాముడి లక్ష్య సాధనకు ఉపయోగపడిన వానరసేనగా అభివర్ణించుకుంటూ వుంటారు. ఎంత వానర సేన అయనా కొంతమందిలో ఒరిజినల్ లక్షణం ఎక్కడకి పోతుంది? అలా ఒరిజినల్ లక్షణం పోని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఈమధ్య కాలంలో పార్టీలో ఎంతో కంగాళీ చేశాడు.

 

తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు కుదరకుండా చేయడానికి శాయశక్తులా కృషి చేశాడు. పొత్తుల ఇష్యూ సాగటానికి కారణం అయ్యాడు. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పుడు కూడా బీజేపీ కార్యకర్తల చేత రాజీనామాలు చేయించడం, ధర్నాలు చేయించడం లాంటి చిన్నపిల్ల చేష్టలు చేయించాడు. బీజేపీలో పెద్ద తల అయిన వెంకయ్య నాయుడికి తెలంగాణ బీజేపీలో వ్యతిరేకతను పెంచ పోషించాడు. అలాగే పార్టీలో సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆశిస్తున్న సికింద్రాబాద్ ఎంపీ స్థానం మీద కన్నేసి ఆ సీటు తనకు కావల్సిందేనని మొండి పట్టుదల ప్రదర్శించాడు. సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ ఇవ్వకపోతే తాను ఎన్నికలలో పోటీ చేయనని పార్టీ నాయకత్వానికి వార్నింగ్ ఇచ్చాడు.

కిషన్ రెడ్డి వ్యవహారశైలిని ఇంతకాలం భరిస్తూ వస్తున్న బీజేపీ నాయకత్వం కిషన్ రెడ్డి తోకని కట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు చేసింది చాలు. ఇంకా అతిచేస్తే చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించడంతో కిషన్ రెడ్డి దారిలోకి వచ్చి, అంబర్‌పేట స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి అంగీకరించినట్టు తెలిసింది. కిషన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం కూడా ముగిసింది. తోక కట్ చేయించుకున్న కిషన్ రెడ్డికి అంబర్ పేటలో కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రత్యర్థి మరెవరో కాదు.. కిషన్ రెడ్డి కంటే మహా ముదురు ‘హనుమ’.