నేడే కిరణ్ కొత్త పార్టీ ప్రకటన
posted on Mar 6, 2014 @ 11:21AM
ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నారని మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు మాదాపుర్ లో తన సన్నిహితులతో కిరణ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కొత్త పార్టీపై చర్చించి..ఆ తరువాత ఆరు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కిరణ్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే సీమాంధ్రలో ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై సర్వేలు కూడా చేసినట్లు సమాచారం. బుధవారం ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తరువాత ఇప్పుడు కిరణ్ కొత్త పార్టీని ప్రకటించిన ప్రయోజనం వుండదని కొంతమంది నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా ఆరవై రోజులు సమయమే వున్నందున...కిరణ్ కొత్త పార్టీ పెట్టిన సీమాంధ్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.