దామోదర ఇలాకాలో కిరణ్
posted on Apr 29, 2013 @ 10:36AM
ఒకరు ముఖ్యమంత్రి. మరొకరు ఉప ముఖ్యమంత్రి. కలసి ఉండి ప్రభుత్వాన్సి నడిపించాల్సిన వారికి ఎవరికి వారే పై చేయి అనిపించుకోవాలన్న ఆశ. ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో తనకు ప్రాధాన్యం లేదని, ఆ కార్యక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లలో నా ఫోటో పెట్టలేదని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఆయన హాంకాంగ్ కు ఫ్లైటెక్కి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహల మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి.
తనకు సరయిన ప్రాధాన్యం లభించడం లేదని ముఖ్యమంత్రి మీద అలిగిన రాజనర్సింహ ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం తరువాత కూడా అలకవీడలేదు. ఆయన రాజనర్సింహ సొంత జిల్లాలో పర్యటిస్తుంటే అందుబాటులో లేకుండా పోయారు. ఆరు జిల్లాలలో ఇప్పటికి ఇందిరమ్మ కలలు పథకం కార్యక్రమం సాగింది. కానీ ఎక్కడా ఉప ముఖ్యమంత్రికి ప్రాధాన్యం లేదు. దానికితోడు ఇన్నాళ్లు తన వెంటనే ఉన్న జిల్లా ఎమ్మెల్యే జగ్గారెడ్డితోనే ఇప్పుడు తన మీద ముఖ్యమంత్రి విమర్శలు గుప్పిస్తున్నారని రాజనర్సింహ గుర్రుగా ఉన్నారు. మొత్తానికి ఆయన లేకుండానే ఆయన జిల్లాలో నేటి ముఖ్యమంత్రి పర్యటనకు రంగం సిద్దమయింది.