కింగ్ ఫిషర్ అకౌంటింగ్ స్కామ్
posted on Nov 9, 2012 @ 11:57AM
సత్యం కంప్యూటర్స్ తరహాలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కూడా భారీ స్థాయిలో అకౌంటింగి స్కామ్ కి పాల్పడిందని ఆడిటర్లు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి చూపించాల్సిన లెక్కలు చూపించి ఉంటే నష్టం ఇంకా భారీ స్థాయిలో ఉండేదని, కాకి లెక్కలతో జనాన్ని మోసం చేశారని ఆడిటర్లు భావిస్తున్నారు.
కంపెనీ ప్రకటించిన క్యూ2 నష్టం 754 కోట్లు రూపాయలుకాగా.. ఆమోదనీయమైన అకౌంటింగ్ పద్ధతిని అనుసరించి ఉంటే ఈ నష్టం దాదాపు ఒకవెయ్యీ ముఫ్పై రెండు కోట్ల రూపాయలు ఉండేదని ఆడిటర్లు భావిస్తున్నారు. దీంతో ఖాతాల్లో అవకతవకలు భారీ స్థాయిలో జరిగుండొచ్చన్న అనుమానాలు గట్టిగా వ్యక్తమౌతున్నాయ్.
సత్యం కంప్యూటర్స్ స్కామ్ కీ, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ స్కామ్ కీ చాలా దగ్గరి పోలికలున్నాయని ఆడిటర్లు భావిస్తున్నారు. సత్యం కంప్యూటర్స్ తన లాభాల్ని భారీ స్థాయిలో పెంచి చూపిస్తే, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాల్ని భారీగా తగ్గించి చూపించిందని చెబుతున్నారు. ఈ చిన్న వ్యత్యాసం తప్ప రెండు కంపెనీల ఫ్రాడ్ లో పెద్దగా తేడాలేదని అభిప్రాయపడుతున్నారు.
లిక్కల్ కింగ్ విజయ్ మాల్యాకి చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వరసగా 23 వ క్వార్టర్ లోనూ భారీ నష్టాల్ని చవిచూసింది. సెప్టెంబర్ చివరి నాటికి కంపెనీ నష్టాలు దాదాపు 9 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయ్. క్యూ2 ఆదాయం 87 శాతం పడిపోయి 200 కోట్ల రూపాయలకు చేరింది. ఇప్పటికే ఈ కంపెనీకి 7000 కోట్ల రూపాయలకు పైగా రుణాలిచ్చిన బ్యాంకులు ఇకపై ఏగానీ కూడా ఇవ్వలేమని చేతులెత్తేశాయ్.