అనారీ పాట .. కిలీ నోట!
posted on Aug 5, 2022 @ 10:44AM
కిసీ కి ముస్కురాహటోంపే..అనారీ సినిమాలో పాట.. ఓ అద్భుతం. పాట వింటూంటే అలా ముఖేష్ గళం అలా మాయచేస్తుంది. అసలు అనారీ పాటలే ఓ మాయచేస్తాయి. ఆ మాటకు వస్తే పాత పాట, పెద్దల మాట ఎప్పటికీ బంగారమే. మంచిపాట, మంచి ట్యూన్ తో ఉన్నది ఖండాంతరాలకీ వెళుతుంది.
కిలీ పాల్ ఈ పాటకు లిప్ సింక్ ఇచ్చి ఇన్‌స్టామ్‌గ్రామ్‌లో మిలియన్లమంది అభిమానులను సంపాదించా డు. రాజ్‌కపూర్ నటించిన సినిమా అనారీలో ఆ పాట అతన్ని అంతగా ఆకట్టుకుంది. వెంటనే దాన్ని కూనిరాగం నుంచి మెల్లగా అదే ట్యూన్ కి లిప్ సింక్ ఇస్తూ పాత హిందీ సినిమా పాట మీద వీరాభిమానాన్ని ప్రకటించాడు. అనురాగ్ కశ్యప్, రిచా చద్దా వంటి సెలబ్రిటీలు కూడా కిలీ కి ఫిదా అయ్యారు.
పాత బంగారం పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షమందికి పైగా నెటిజన్లను ఆకట్టుకున్న పాటకు శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చగా ముఖేష్ పాడారు. ఇలా మరిన్ని పాడి వినిపించాలని, మేమంతా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాం, భారత్ ఒక్కసారి వచ్చిపోరాదా.. అంటూ ఇపుడు నెటిజన్లు కిలీకి మెసేజ్‌ల వరద వచ్చి పడుతోంది.
గతంలో టాంజానియా లో భారత హైకమీషనర్ కార్యాలయం కిలీని సత్కరించింది. కిలీకి భారత్ పట్ల ఎంతో అభిమానమని, భారతీయ సంస్కృతీ, సంగీతమన్నా ఎంతో గౌరవమని చెబుతూ ఆ కార్యాలయం ఆయనకు అవార్డు ప్రదానం చేసింది. భారత ప్రధాని నరేంద్రమోదీ తమ మన్ కీ బాత్‌లోనూ కిలీ భారత అభిమానాన్ని ప్రస్తావించడం గమనార్హం.