నీటి ప్రాజెక్టుల క్రింద చిగురిస్తున్న ఖరీఫ్ సాగు
posted on Aug 15, 2012 @ 10:44AM
ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో కృష్టానదిలో నీటి మట్టం పెరుగుతోంది . గత రెండు నెలలుగా డెడ్‌స్టోరేజ్ కంటే దిగువకు పడిపోయిన నీటితో ఎడారులను తలపించిన ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటుంన్నాయి. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆలమట్టి ఇప్పటికే పూర్తి స్ధాయిలో నిండిపోవడంతో అక్కడి అధికారలు 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.దీంతో మన రాష్ట్రంలోని శ్రీశైలం ,నాగార్జున సాగర్ మెరుగుపడుతున్నాయి.
శ్రీశైలం జలాశయాల నీటి మట్టం గరిష్టంగా 885 అడుగులు కాగా ప్రస్తుతానికి 801 అడుగుల వుంది. నాగార్జున సాగర్ ఇన్‌ప్లో పెద్దగా లేకపోవడంతో పరిస్ధితి ఆశాజనకంగా లేదు. సాగర్‌దిగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్‌ప్లో 3.88 లక్షల క్యూసెక్కుల నీరుండగా దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో సరిపడినంత నీరు లేదు. సాగునీటి ప్రాజెక్టులక్రింద ఖరీఫ్‌ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జూరాల నిండిపోవడంతో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. వరినాట్లు వేసే పనులు కూడాపుంజుకుంటు న్నాయి. శ్రీశైలం నీటిమట్టం పెరగంగానే రాయలసీమకు నీటిని విడుదల చేయనున్నారు.కర్నూలు, కడప కాలువతోపాటు తెలుగుగంగ, శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 840 అడుగులకు చేరుకునేదాక డ్యాంనుండి నీటిని విడుదల చేయరాదని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు దీన్ని అమలుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.