రైతును కాటేసిన ఖరీఫ్
posted on Aug 16, 2012 @ 10:46AM
రాష్ట్రంలో ఖరీఫ్ పంట సాగుకు కటాఫ్ డేట్ ప్రకటించారు .ఈనెల 15తో ఖరీఫ్ సాగును ముగించి, ఇప్పటినుండి వేసే పంటలకు ఎర్లీ రబీ పంటలుగా పరిగణించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. నీటి ప్రాజెక్టుల క్రింద కూడా వరిసాగుకు ఇదే తేదీ వర్తిస్తుంది. రెవెన్యూ వ్యవసాయమంత్రులు రఘవీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ ఆయా జిల్లా కలెక్టర్లకు ఇతర అధికారులకు వీడియో కాన్పరెన్సులో ప్రత్యామ్న పంటలకు రైతుల్లో అవగాహన పెంచవలసినదిగా సూచించారు. జిల్లాలు, ప్రాంతాల వాతావరణానికి తగ్గట్లు మొక్కజొన్న, జోన్న,ప్రొద్దుతిరుగుడు,సజ్జ తదితర పంటలు సాగు చేసేందుకు ఇప్పటికే పంటల సాగు ప్రణాళికలను సిద్దంచేశారు.
రాష్ట్రంలో ఖరీఫ్ సాగు80 లక్షల హెక్టాంర్ల కు గాను 60 లక్షల హెక్టార్ల దగ్గర నిలచిపోయింది. ఇప్పటివరకు పంటల విస్తీర్ణం ప్రాంతాలవారీగా కోస్తాంద్రలో 24.96 లక్షల హెక్టార్లకు గాను 13.65 లక్షలు హెక్టార్లు సాగయ్యాయి. రాయలసీమలో 18.50 గాను 12.77 లక్షల హెక్టార్లు సాగు చేశారు.తెలంగాణలో 37.29 గాను 34.22లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు.మొత్తం మీద తెలంగాణ ప్రాంతంలోనే పంటల సాగు ఇతర ప్రాంతాలకంటే మెరుగ్గా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ వరి సాగుకు భారీగా గండి పడిరది. ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 26.47 లక్షల హెక్టార్లు కాగా 11.83 లక్షల హెక్టార్లలో మాత్రమే వరి నాట్లు వేశారు.