కాటేస్తున్న కల్తీసారా
posted on Aug 16, 2012 @ 10:42AM
రాష్ట్రంలో మరోమారు కల్తీసారా పడగ విప్పింది.కల్తీసారా, కల్తీకల్లుకు నిరుపేదలు బలి అవుతున్నారు.కిక్ కోసం కల్తీసారాలో కలిపే మిధనాల్, కల్తీకల్లు తయారీకి వాడే అల్ఫాజోలం డోస్ పెరిగి తాగిన వారి ప్రాణాలు హరిస్తున్నాయి. మంగళవారం మెదక్‌జిల్లా ఘటన రాష్ట్రంలో కొత్తదేమీ కాదు. ఆదివారం మెదక్‌జిల్లాలో 65 మంది అస్వస్తతకు గురిఅయ్యారు. దానిలో 5 గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు కారణం ప్రక్కనే ఉన్న మహారాష్ట్ర గీత కార్మికులు నిషేదిత అల్ఫాజోలం మత్తుమందును కల్లులో కలిపారని తెలిసింది. వీటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్ తరలించారు.ఇందుకు కారకులైన వారిని అరెస్టు చేశారు.
గత ఏడాది డిసెంబరు 31న కృష్ణా జిల్లా మైలవరంలో కల్తీ మద్యంతాగి 17 మంది మరణించారు. నల్గొండలోని చౌటుప్పల్ మండలంలో కల్తీ కల్లు తాగి అదే రోజు మరొకరు మరణించారు. కొత్తసంవత్సరం వేడుకులకు మద్యాన్ని కొనుగోలు చేయలేని కృష్ణాజిల్లా మైలవరంలోని గిరిజనులను తక్కువ ధరలకు లభించే నాటు సారాను ఆశ్రయించిన వారికి మిధనాల్ రూపంలో మృత్యువు కబలించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిషేధిత రెక్టిపైడ్ స్పిరిట్‌ను 40 శాతం మరో 60 శాతం నీటితో కలిపి నాటు సారా తయారు చేయటం సులువు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయని విమర్శలు వెల్లు వెత్తు తున్నాయి.
మరో విధానంలో కల్లును, నల్లబెల్లాన్నీ పులియబెట్టి నాటు సారా తయారు చేస్తారు. ఈ విధానాన్ని తెలంగాణాలో అధికంగా వాడుతున్నారు. ఇదంత ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు. గత రెండేళ్లగా కల్తీకల్లు, కల్తీమద్యం మరణాలు ఎక్కువయ్యాయి. 2009-2010 లో నాటుసారాకు తూర్పుగోదావరి జిల్లాలో 18 మంది మృత్యువాత పడ్డారు. వివిధ ప్రాంతాల్లో మరో 13 మందితో కలిపి మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 2010-11లో ప్రభుత్వం లెక్కకు అందినవి 20 కాగా లెక్కకు అందనివి అంతకన్నా ఎక్కువే అని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగుచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.