కొల్లం ఘటన.. లొంగిపోయిన ఐదుగురు అధికారులు
posted on Apr 12, 2016 @ 10:14AM
కేరళలోని కొల్లం పుట్టింగల్ దేవి ఆలయంలో బాణసంచా పేలి ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 109 మంది చనిపోగా.. 400 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే ఏదో ప్రమాదవశాత్తు జరిగిందనుకున్న ఈ ఘటనపై కొత్త కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రమాదం జరిగిన చోట మూడు కార్లు.. వాటినిండా బాంబులు, పేలుడు పదార్ధాలు ఉండటంతో ఈ అనుమానాలకు ఆజ్యం పోసినట్టైంది. ఇక పోలీసులు ఆదిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఐదుగురు అధికారులు పోలీసుల ముందు లొంగిపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా బాణాసంచా పోటీలకు అనుమతి నిరాకరించినా... అధికారులు పట్టనట్లు వ్యవహరించారని కొల్లం కలెక్టర్ ఎ.షాయినామోల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈఘటనపై ఇంకెన్ని కొత్త విషయాలు బయటపడతాయో చూడాలి.