కేరళ సీఎంగా పినరాయి విజయన్.. అచ్యుతానందన్ కు నిరాశే
posted on May 20, 2016 @ 3:05PM
కేరళ సీఎంగా పినరాయి విజయన్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో నిన్న ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎల్టీఎఫ్ ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే సీఎంగా ఎవరు పీఠాన్ని అధిష్టిస్తారు అన్నదానిపై చర్చలు జరుగగా విఎస్ అచ్యుతానందన్.. పినరాయి విజయన్ పేర్లు వినిపించాయి. వీరిద్దరూ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి ఆసక్తిచూపించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఎన్నికపై తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ(ఎం) స్టేట్ కమిటీ.. ఆ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ పినరాయి విజయన్ ను సీఎంగా నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే అధికారింకంగా మాత్రం రేపు ప్రకటినంచనున్నారు. దీంతో అచ్యుతానందన్ కు నిరాశ మిగిలింది.
కాగా మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 92 స్థానాలలో, యూడీఎఫ్ 47 స్థానాలు, బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.