కేరళ సీ.ఎం చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు
posted on Jan 28, 2016 @ 10:30AM
సోలార్ స్కామ్‌లోని పాపాలు ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మెడకి చుట్టుకుంటున్నాయి. స్కామ్‌లోని ముఖ్య పాత్రధారి సరితానాయర్ తాను ముఖ్యమంత్రికి రెండు కోట్లు ముట్టచెప్పానని కుండబద్దలుకొట్టడంతో చాందీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. సరితా నాయర్, ఆమెతో సహజీవనం చేస్తున్న రాధాకృష్ణ కలిసి 2011లో సౌర విద్యుత్తుకి సంబంధించి ఒక సంస్థను నెలకొల్పారు. భవిష్యత్తలో ప్రభుత్వం స్థాపించే సౌర విద్యత్ ప్రాజెక్టులన్నీ తమకే వస్తాయని చెప్పి వీరిద్దరూ జనాల దగ్గర్నుంచీ కోట్లాది రూపాయలు దండుకున్నారు. దీనికి ఉమెన్ చాందీ సహకారం ఉందన్నదే ఇప్పుడు ప్రధాన ఆరోపణ. తన పేరు వాడుకున్నందుకు ఉమెన్ చాందీకి కావల్సినంత సొమ్ము ముట్టిందట! దానికి తోడు ఉమెన్ చాందీ లై డిటెక్టరు పరీక్షలను కూడా నిరాకరించడంతో విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. మరోవైపు ఉమెన్ చాందీకి సానుభూతి చూపిస్తున్నవారికి కూడా కొదవ లేదు. రాజకీయాలలో వేల కోట్లు హరాయించేసుకున్నవారే దర్జాగా బతుకుతుంటే, ఆఫ్టరాల్ రెండు కోట్ల కోసం ముఖ్యమంత్రి అంతటివాడిని ఇబ్బంది పెడతారా అని సదరు సానుభూతిపరులు జాలిపడుతున్నారు!