పెరుగుతున్న సోలార్ స్కాం హీట్..
posted on Jan 29, 2016 @ 4:17PM
కేరళ సీఎం ఊమెన్ చాందీ సోలార్ స్కామ్ లో ఇప్పటికే పీకల్లోతు ఉచ్చులో కూరుకుపోయారు. ఇప్పటికే ఈ స్కాంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ సీఎంకు రూ.కోటి తొంభై లక్షలు ఇచ్చానని చెప్పడంతో సీఎంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇప్పుడు కేరళ రాష్ట్రం సోలార్ స్కామ్ హీట్ తో వేడెక్కిపోయింది. మరోవైపు సీపీఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. సీఎం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ను చుట్టుముట్టారు. దీంతో వారిని అడ్డుకోవడానకి వచ్చిన పోలీసులపై కూడా కార్యకర్తలు రాళ్ళు విసరడంతో వారిని చెల్లాచెదురు చేయడానికి.. పోలీసులు బాష్పవాయు గోళాలు, లాఠీలు ఉపయోగించారు. మొత్తానికి సీఎం సోలార్ స్కాం వ్యవహారంతో రాష్ట్రం హీటెక్కిపోతుంది.