లెప్టినెంట్ గవర్నర్ పాలనా? ఢిల్లీ ప్రభుత్వ పాలనా?
posted on May 12, 2023 @ 4:21PM
దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ వంటి పాక్షిక రాష్ట్రానికి పరిపాలనలో తేడా ఉంటుంది. పార్లమెంటు ఆమోదంతో తయారైన చట్టాలు ఢిల్లీకి వర్తిస్తాయి. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వలె ఢిల్లీ ముఖ్యమంత్రి పరిపాలన ఉండదు. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. చట్ట సభ ద్వారా అధికారంలో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వలె అధికారుల మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. అయితే ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్నికేంద్రం అణచి వేస్తుందా? మోదీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నారా? వంటి ప్రశ్నలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తమ రాష్ట్ర పరి పాలనా వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఆరోపిస్తూ ఇవ్వాళ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ ప్రభుత్వానికి తగిన న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు.
కేంద్ర పాలనలో ఉండే చిన్న ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం అంటారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రాంత పాలన ఉంటుంది. ఇప్పటి వరకు దేశంలో ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దిల్లీ, పుదుచ్చేరి, అండమాన్-నికోబర్ దీవులు, దాద్రా-నగర్ హవేలీ, చంఢీగర్, డామన్-డయ్యూ, లక్షదీవులు. కొత్తగా నిర్ణయించిన జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్ యూటీలు కూడా ఏర్పడితే కేంద్ర పాలిత ప్రాంతాలు తొమ్మిది అవుతాయి.
ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కలిగి ఉన్న పరిపాలనా విభాగంగా రాష్ట్రాలను నిర్వచిస్తారు. ఇవి సొంతంగా చట్టాలను రూపొందించుకోవచ్చు. పారిపాలన కోసం ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఉంటుంది. చట్ట సభ ఉంటుంది.
రాజ్యసభకు ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ, కేంద్ర పాలిత ప్రాంతం పాలన నేరుగా కేంద్ర చేపడుతుంది.
శాసన సభ ఉన్న, లేని కేంద్రపాలిత ప్రాంతాలకు బేధం ఉంది.
దిల్లీ, పుదిచ్చేరి మాదిరిగా ఉన్న యూటీలకు శాసన సభ ఉంటుంది. ఎన్నుకున్న ఎమ్మేల్యేలు ఉంటారు. అయితే, ఎగువ సభ(విధాన సభ) ఉండదు. తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. ఈయనను కేంద్రం నియమిస్తుంది. చట్టసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఒక విధంగా పాక్షిక రాష్ట్రం అని చెప్పొచ్చు.
లెఫ్టినెంట్ గవర్నర్ తమ ప్రభుత్వాన్ని వేధింపులకు గురి చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రధాన ఆరోపణ. చాలా కాలంగా ఈ వివాదం ఉంది. ఇవ్వాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుప్రీం కోర్టు ను ఆశ్రయించే ఒక రోజు ముందు సుప్రీం ఆయనకు ఊరట కలిగించే ఆదేశాలు జారి చేసింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి విశేష అధికారాలు ఉంటాయని ఈ ఆదేశాల ముఖ్య ఉద్దేశ్యం.
అధికారుల బదిలీలు, పోస్టింగ్ ల విషయంలో లెప్టినెంట్ గవర్నర్ జోక్యం బాగా పెరిగిపోయిందని కే జ్రీవాల్ మరొకసారి సుప్రీంను ఆశ్రయించారు. కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించడంతో కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉండే అధికారాలు ఎంతవరకు అనే అంశంపై ప్రత్యేక చర్చకు అంకురార్పణ జరిగినట్టయ్యింది.