కరోనాను జయించిన కేసీఆర్.. నేటి నుండి విధుల్లోకి ..
posted on May 5, 2021 8:23AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి ఆన్ డ్యూటీ చేయనున్నారు. దాదాపు రెండు వారాలకు పైగా కరోనా తో బాధపడిన కేసీఆర్, చివరికి కరోనా ను సైతం జయించాడు. ఐసోలేషన్‌లో ఉన్న కూడా విధులు నిర్వహించిన ఘనత కేసీఆర్ మాత్రమే దక్కింది. అక్రమాలు చేశారని ఆరోపణలు వస్తున్నాయని ఈటల పై యాక్షన్ తీసుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన రెండు పరీక్షల్లోనూ కరోనా నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం నిన్న ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ పరీక్షలు నిర్వహించింది. ఆ రెండింటిలోనూ కరోనా లేదని నిర్ధారణ అయింది. చివరికి అలాగే, రక్త పరీక్షల్లోనూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తేలింది.
ముఖ్యమంత్రి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, కాబట్టి ఇక నుంచి విధులకు హాజరు కావొచ్చని వైద్యులు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 19న కరోనా బారినపడ్డారు. అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌లోనే ఉన్నారు. నేడు హైదరాబాద్ రానున్న సీఎం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
కరోనా దెబ్బకు ప్రముఖ దేవాలయాలు మూసివేత..
హైదరాబాద్‌లో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాలను మూసివేయాలని ఆయా ఆలయాల అధికారులు నిర్ణయించారు. ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నేటి నుంచి సాధారణ, ప్రత్యేక దర్శనాలతోపాటు అన్ని సేవలను నిలిపివేస్తున్నట్టు పెద్దమ్మతల్లి ఆలయ అధికారులు తెలిపారు. అయితే, అంతరాలయంలో నిత్య పూజలు మాత్రం జరుగుతాయని స్పష్టం చేశారు.
బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయ అధికారులు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపూర్ణ తెలిపారు. భక్తులు, అర్చక సిబ్బంది క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆలయం పక్కనే ఉన్న బోనం కాంప్లెక్స్‌ను కూడా మూసివేస్తున్నట్టు తెలిపారు. అమ్మవారి ఏకాంత సేవలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు.