అడ్డూఅదుపులేని హరీశ్‌రావు? పార్టీకి చెడ్డపేరు వచ్చినా పట్టించుకోని కేసిఆర్?
posted on Aug 25, 2012 8:55AM
తెలంగాణారాష్ట్రసమితి(టిఆర్‌ఎస్) నేత హరీష్‌రావు ఎప్పుడూ వివాదస్పద వ్యక్తిగా నిరూపించుకుంటూనే ఉన్నారు. ఈయన చేతికి అడ్డూఅదుపు కూడా ఉండవని, నోటిలో నుంచే మాటలు కూడా అలానే శృతి మించుతుంటాయని ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గమనిస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఈ అడ్డూ అదుపూ లేని ఈయన ఒకసారి ఢల్లీలోని ఆంధ్రాభవన్‌లో ఉద్యోగిపై చేయి చేసుకుని నాయకుడుగా ఎదిగాం కాస్త జాగ్రత్తగా ఉండాలనే ఇంగితాన్ని కూడా మరిచినట్లు ప్రవర్తించిన విషయం మీడియాలో క్లిప్పింగుల ద్వారా బహిర్గతమైంది. అలానే యావత్తు రాష్ట్రం కూడా అతని దురుసుస్వభావానికి సిగ్గుపడిరది. ఒక్క టిఆర్‌ఎస్ పార్టీ మాత్రమే ఇంత దురుసైన నాయకుడు ఉన్నాడని ఆనందించినట్లుంది. అందుకే ఢల్లీ నుంచి వచ్చాక హరీష్‌రావుకు అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. పైపెచ్చు మీడియాలో తెలంగాణాకు వ్యతిరేకంగా ఎవరు ప్రచారం చేసినా ఆగలేక ఈయన చేతికి పని చెబుతూనే ఉన్నారు. ఇలానే తాజాగా హరీష్‌రావుపై పంజాగుట్ట పోలీసుస్టేషనులో కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసుఅధికారిపై ఆయన దురుసుగా ప్రవర్తించినందుకు ఐపీసీ సెక్షను 128, 353,297,506,349 కింద కేసు నమోదు చేశారు. అయినా ఆయన పక్కా రాజకీయవాది కాబట్టి ఏమాత్రం సిగ్గుపడరనుకోండి. ఇక ఆ పార్టీ అధినేత కేసిఆర్ గురించి కూడా ఈ విషయంలో చెప్పుకోవాలి. ఇంతలా పలుమార్లు హరీష్‌రావు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే ఆయనేమి చేస్తున్నారు? కనీసం పార్టీపరంగా క్రమశిక్షణాచర్యలు తీసుకోలేదు సరికదా అదనపు బాధ్యతలను అప్పగించేస్తుంటారు. సో! నోరున్న హరీష్‌రావు తన చేతి దమ్ము నిరూపించుకుంటున్నాడని కేసిఆర్ మద్దతు ఇస్తున్నారన్న మాట. అయితే హరీష్‌రావుపై ఎవరు కేసు పెట్టాలన్నా ముందుగా ఆయన్ని అదుపు చేయలేని చవటపై కూడా కేసు పెడితే సరి అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.