కే.సి.ఆర్ కొత్త ప్రేలాపన ...తెలంగాణా తల్లికి 80 ఏళ్ళట ?
posted on Aug 8, 2012 8:07AM
ఆరుకోట్ల ఆంధ్రుల అభిమాన భాష తెలుగు అని, తెలుగుభాష తీయదనం ఇతర భాషల్లోనే లేదని 1982లో నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో చెప్పారు. ఇప్పటికీ భాషాప్రయుక్తరాష్ట్రాలుగా విడిపోయినప్పటి నుంచి తెలుగుతల్లికి వందనం సమర్పించటం ఆంధ్రుల ఆత్మగౌరవంగా భావిస్తారు. కోస్తాజిల్లాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో అభివృద్థి చెందుతూ ఉన్న తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ తెలుగు భాషనే మాట్లాడుతున్నారు. అసలు ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులే రాకపోతే తెలంగాణాలో ఏముంది? కూలీనాళీ చేసుకునేందుకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటం మినహా తెలంగాణాలో అలవాటైన పనేమిటీ? వ్యవసాయం కూడా పూర్తిస్థాయిలో చేయలేని వాతావరణం తప్ప! కనీసం నీటికి కూడా కరువయ్యే ఈ జిల్లాల గురించి కేసిఆర్ మాత్రమే గొప్పగా చెప్పుకోవాలి. ఖమ్మం నుంచి విజయవాడ వరకూ వెళ్లే కూలీలను చూసి వారి బాధలను అర్థం చేసుకుని ఉంటే వేర్పాటు ఉద్యమం మానేసి ఆకలితీరే పని చేసి ఉండేవారని పలువురు ఆయన్ను విమర్శిస్తున్నారు.
తన స్వార్థం కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ ఎక్కడ కూలిపోతుందో అన్న భయంతోనే కేసిఆర్ అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆత్మవంచన మానేసి అసలు విషయాన్ని అవగతం చేసుకోలేని టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ఒక కొత్త విషయం కనిపెట్టారు. అదేమిటంటే 80 ఏళ్ల క్రితమే తెలంగాణా తల్లి పుట్టుకొచ్చిందని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలు బిడ్డ తల్లిపాలు తాగి రొమ్మును పిసికేస్తాడని కేసిఆర్‌ను చూసిన వారు చెప్పుకునేలా వ్యవహరిస్తున్నారు. అసలు చరిత్రపై కొద్దిగా కూడా అవగాహన లేని కేసిఆర్ అప్పుడప్పుడు మేథావిలా ప్రేలాపనలు పేలుతుంటారని ఆయన పార్టీలోని వారే విమర్శిస్తున్నారు. 80ఏళ్ల క్రితం పుట్టుకొచ్చింది తెలంగాణా తల్లి అంటే అసలు ఉన్న తెలుగుతల్లి అని పరోక్షంగా అంగీకరించినట్లే అన్న విషయం కేసిఆర్ అర్థం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. మతిభ్రమించినప్పుడే విశ్రాంతి అవసరమని, లేనిపోని ఉద్యమాల పేరు చెప్పి యువత ప్రాణాలు తీయరాదని రాజకీయ మేథావులు కోరుతున్నారు. అసలు తెలంగాణా తల్లి పేరు చెప్పి కేసిఆర్ కొమ్ము విసిరేది ఎందుకంటే ఆయన చెవులకు మాత్రమే కొన్ని సిగ్నల్స్ వినిపిస్తాయని తెలంగాణావాదులంటున్నారు. ఎవరికీ వినిపించని, కనిపించని సిగ్నల్స్ వినిపిస్తున్నాయంటే కేసిఆర్ తను బతికున్న రోజులు గుర్తు చేసుకోవాలంటున్నారు. స్పీకర్‌గా ఉన్నప్పుడు ఎన్నిసార్లు తెలుగుతల్లి విగ్రహానికి దండ వేశారో అప్పుడే మరిచిపోయి విక్రమార్కుని ప్రేతాత్మలా కేసిఆర్ విజృంభిస్తే ఘోరపరాభవం తప్పదని ఆంథ్రులు హెచ్చరిస్తున్నారు.