కెసిఆర్ ఎత్తుగడ ఫలించింది!
posted on Jun 19, 2013 @ 12:05PM
కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్ళిన సీనియర్ లీడర్ కేశవరావు .. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు. కేశవరావు కి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా వస్తుందని అంతా బావించారు. ఇంతలో ఏమైందో కాని సెక్రటరీ జనరల్ గా నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ నిర్ణయించారు. కేశవరావు గారి ఆధ్వర్యంలో తాము కచ్చితంగా ప్రత్యేక తెలంగాణ సాధించి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే కేశవరావు కి సెక్రటరీ జనరల్ గా నియమించడం వెనుక కెసిఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ ఉందని అందరూ భావిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే , కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని పార్టీ అదినేత కె.చంద్రశేఖరరావు కాని, పార్టీలోని ప్రముఖులు కాని అబిప్రాయపడ్డారని అంటున్నారు. ఆయనకు పార్టీ తరపున జాతీయ వ్యవహారాలు అంటగట్టి...రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఎత్తుగడ వేసినట్టు చెబుతున్నారు.
ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అద్యక్షుడిగా పనిచేసిన కేశవరావు ఇప్పుడు మరో ఉప ప్రాంతీయ పార్టీలో సెక్రటరీ జనరల్ గా నియమితులవడం కూడా ఆసక్తికరమైన విషయమే.