తెలంగాణవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
posted on May 29, 2014 @ 11:08AM
పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా గురువారం బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఈ ఉదయం నుంచే టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.ఆర్టీసీ డిపోల ఎదుట టీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించి ఆందోళన తెలిపారు. దీంతో ఖమ్మం, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్‌లో బస్సులు నిలిచిపోయాయి. బంద్‌కు టీఎన్‌జీవో, టీజీవో, ఆర్టీసీ టీఎంయూ, లాయర్ల జేఏసీ, టీజేఎఫ్ మద్దతు తెలిపాయి. కాగా బంద్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు.