కేసీఆర్ – చంద్రబాబు బస్తీమే సవాల్
posted on Nov 14, 2012 @ 9:40AM
తెలంగాణపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ టిఆర్ఎస్ నేతలు, టిడిపి నేతలు సవాల్ చేసుకుంటున్నారు. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అంటూ కేసీఆర్ చేస్తున్న వాదనల్ని కొట్టిపారేసేందుకు టిడిపి నేతలు కొంతకాలంగా తీవ్రస్థాయిలో తిరుగు సమాధానాలిస్తున్నారు.
చంద్రబాబు చర్చకి సిద్ధమేనా అంటూ టిఆర్ఎస్ నేత హరీష్ రావ్ చేసిన సవాల్ ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న టిడిపి నేత కడియం శ్రీహరి.. కెసీఆర్, హరీష్ రావ్ ల స్థాయికి చంద్రబాబు అవసరం లేదని తాను బహిరంగ చర్చకి సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు.
అటు హరీష్ రావ్ కూడా ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు స్థాయికి, కడియం స్థాయికి తాను సరిపోతానని, బహిరంగ చర్చకి కేసీఆర్ అంత పెద్దమనిషి అవసరం లేదని వ్యాఖ్యానించారు. మొత్తంమీద ఇరువర్గాలమధ్య సవాల్ , ప్రతి సవాల్ పర్వం ఘాటుగా సాగుతోంది.